Site icon Prime9

Adipurush: భారీగా లాభాలు కురిపిస్తున్న ఆదిపురుష్.. రిలీజ్ కి ముందే 400కోట్ల బిజినెస్..!

Adipurush

Adipurush

Adipurush: ప్రభాస్ సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథ నుంచి పాటలు ఆటలు అన్నీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. సినిమా బడ్జెట్ దగ్గర నుంచి ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ వరకూ అంతా వందల కోట్లలోనే ఉంటుంది. మరి ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీకి ఏ రేంజ్ లో డబ్బులు వస్తాయంటారు.. మీ ఊహ నిజమే అసలే 600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతోందని బీటౌన్లో టాక్.

అయితే ఆదిపురుష్ కి రావల్సినంత క్రేజ్, హైప్ రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. కానీ ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయిందని మూవీ బడ్జెట్ లో మూడోవంతు డబ్బు.. రిలీజ్ కి ముందే వచ్చేసిందని సమాచారం.. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు.

400కోట్ల బిజినెస్ అయిపోయిందిగా(Adipurush)

ఆదిపురుష్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇలా అన్నీ కలిపి దాదాపు 250 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇక తెలుగులోనే థియేట్రికల్ రైట్స్ 150 కోట్లకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కొనేసినట్లు ఇటీవల ఆ సంస్థ నిర్మాత తెలిపారు. ఇక వేరే అని భాషల్లో కలిపి ఇంకో 100 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన సినిమా రిలీజ్ కి ముందే 400 కోట్లకు పైగానే బిజినెస్ అయిందని తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ నెల 6వ తేదీన తిరుపతిలో ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు చిత్ర బృందం.

Exit mobile version