Prime9

Actor Ali: సీఎం జగన్ ను కూతురు పెళ్లికి ఆహ్వానించిన నటుడు అలీ

Tollywood: సినీ నటుడు అలీ బుధవారం సీఎం జగన్ ను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. ఇటీవలే అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సీఎం జగన్ నియమించారు. దీనికి గాను అలీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సీఎంకు కృతజ్జతలు తెలిపారు. ఇది తన కుమార్తె పెళ్లికి సీఎం ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నానని తెలిపారు.

అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని అన్నారు. ఈ మేరకు జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar