Site icon Prime9

Tollywood News : నటుడు వీకే నరేష్ చేసిన ట్వీట్ వైరల్

vk naresh prime9news

vk naresh prime9news

Tollywood News: న‌టి ప‌విత్రా లోకేష్ వివాదంతో వెలుగు లోకి వచ్చిన నటుడు నరేష్ తాజాగా ఒక ట్వీట్ చేసాడు . సినిమా టికెట్స్ ధరపై నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే.ఇంతకీ నరేష్ చేసిన ట్వీట్ ఏంటంటే ‘‘జనాలు థియేటర్స్‌కి ఎందుకు రావ‌టం లేదు? ఈ లెక్క చాలా సింపుల్ .. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం థియేట‌ర్లో సినిమా చూడాలనుకుంటే రూ.2500 ఖ‌ర్చు పెట్టాలిసి వస్తుంది .టికెట్ రేట్స్ ఎంత అనేది కార‌ణం పక్కన పెడితే బ‌య‌ట కూల్ డ్రింక్స్ , పాప్ కార్న్, సమోసాలు రూ.20 లేదా రూ.30 థియేట‌ర్స్ లోపల రూ.300 రూపాయలకు అమ్ముతున్నారు.ముందు జ‌నాలు ఈ రేట్లకు భయపడే థియేట‌ర్లో సినిమాలకు రావడం లేదు? జనాలు మంచి సినిమాలను మాత్రమే కోరుకోరు? మంచి సౌఖర్యాలను కూడా కోరుకుంటున్నారని ఒక్కసారి ఆలోచించండంటూ’’ నరేష్ తన ట్విట్టర్లో వెల్లడించారు.

సినీ ఇండస్ట్రీ పెద్దలందరు కలిసి తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపి సినిమా టికెట్స్ ధ‌ర‌ల‌ను పెంచమని,దీని వల్ల మాకు కొంత మేరకు లాభాలు వస్తాయని , వాళ్ళ సమస్యలను ఇరు ప్రభుత్వాలతో చర్చించారు . దీని వల్ల ఇప్పుడు థియేట‌ర్స్‌కు వచ్చి సీనిమా చూసే జనాలు లేరని చూసే వారి సంఖ్య కూడా బాగా త‌గ్గిపోయిందని పెరిగిన టికెట్ ధరలు కారణంగానే థియేట‌ర్స్‌కు జనాలు రావడం లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఇదే క్ర‌మంలో రీసెంటుగా విడుదల ఐన సినిమాలు సీతారామం, బింబిసార‌,కార్తికేయ 2, సినిమాలు ఈ టాక్‌ తో సంబంధం లేకుండా సినిమాలు భారీ స‌క్సెస్‌ను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే.టాలీవుడ్ పెద్దలు కొంద‌రు మాత్రం సినిమా టికెట్స్ ధరలు పెంచిన తీరుపై పలు విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

Exit mobile version
Skip to toolbar