Site icon Prime9

Bellamkonda Suresh : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ..

theft in producer bellamkonda suresh car

theft in producer bellamkonda suresh car

Bellamkonda Suresh : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో దొంగతనం జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కారు అద్దం పగలకొట్టి నగదు ఖరీదైన మద్యం సీసాలను, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ కి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం సురేష్‌కు చెందిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. వెళ్లి చూడగా.. లోపల ఉంచిన రూ.50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఈ మద్యం సీసాల ఖరీదు వెయ్యి, రెండువేలు కాదు.. ఏకంగా ఒక్క మద్యం సీసా రూ. 28వేలు ఉంటుందని సమాచారం.

Exit mobile version