Site icon Prime9

The Paradise: నాని రెండు జడల వెనుక ఇంత కథ ఉందా – శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పాడంటే!

srikanth about Nani Look

srikanth about Nani Look

Srikanth Odela About Nani Look: హీరో నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అందులో శ్రీకాంత్‌ ఓదెల సినిమా ఒకటి. దసరా వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తతర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఎప్పుడో దీనిపై ప్రకటన వచ్చింది. దీనికి ది ప్యారడైజ్‌ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసి ఇటీవల నాని లుక్‌కి సంబంధించి గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో నాని లుక్‌ అందరికి షాకిచ్చింది.

స్మార్ట్‌ అండ్‌ కూల్‌ లుక్‌లో ఉండే ఇందులో ఊరమాస్‌ లుక్‌లో కనిపించాడు. రెండు జడలు, ముక్కు పోగులతో సరికొత్త అవతారం ఎత్తాడు. ది ప్యారడైజ్‌ గ్లింప్స్‌ తర్వాత సోషల్‌ మీడియాలో నాని లుక్‌ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నాని రెండు జడలు ఎందుకు వేసుకున్నాడు? అసలు ఈ సినిమా కథేంటి? ఈ లుక్‌కి కథకి ఎలా కనెక్ట్‌ అవుతుందా? ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో నాని లుక్‌పై తాజాగా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల స్పందించాడు.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా నాని లుక్‌, రెండు జడలు కథేంటని యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి అతడు స్పందిస్తూ.. నాని లుక్‌కి ఓ ఎమోషన్‌ కనెక్ట్‌ అయ్యి ఉంది. అదేంటనేది ఇప్పుడే చెప్పను. “నాని లుక్‌ కథకు ఎలా కనెక్ట్‌ అవుతుందనే ఇప్పుడే చెప్పను. కానీ దీనికి సంబంధించిన ఒక విషయం చెబుతాను. నాని జడల వెనుక నా చిన్నతనం దాగి ఉంది. నా వ్యక్తి జీవితంలోని ఓ భావోద్వేగ అంశం దానికి కనెక్ట్‌ అయ్యి ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు అలాగే జడలు వేసేది. జుట్టు అల్లీ జడలు వేసి స్కూల్‌కి పంపేది. ఐదో తరగతి వరకు స్కూల్‌కి నేను అలాగే వెళ్లేవాడిని. ఆ లుక్‌కి, సినిమా కథకు సంబంధం ఏంటనేది మాత్రం సినిమా చూశాక అర్థమవుతుంది” అని చెప్పుకొచ్చాడు.

కాగా ది ప్యారడైజ్‌ గ్లింప్స్‌తో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని విభన్న లుక్‌లో కనిపించబోతున్నాడు. మదర్‌ సెంటిమెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని గ్లింప్స్‌ అర్థమైపోతుంది. ఇది చూసి ఆడియన్స్ ది ప్యారడైజ్‌ కేజీయఫ్, సలార్‌ రేంజ్‌లో ఉండబోతుందంటున్నారు. ఇది నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. SLV బ్యానర్‌పై చేరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version
Skip to toolbar