Site icon Prime9

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ మరో రికార్డు

Bollywood: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఈ ఏడాది విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సోషల్ మీడియా మరియు టీవీ డిబేట్లలో టాపిక్ అయింది . దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు ఒక రేంజ్ లో పెరిగాయి. ఇప్పటివరకు విడుదలైన 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. IMDBలో 8.3 రేటింగ్‌లతో, ఈ చిత్రం ఇప్పటికీ ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లపై మంచి ఆదరణ పొందుతోంది.

దీనిపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసాడు. “@IMDb ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం నంబర్ 1 #TheKashmirFiles. దీనికి ముందు 3 ఇడియట్స్ IMDBలో 8.4 రేటింగ్‌ను సాధించిన ఏకైక బాలీవుడ్ హిందీ చిత్రం. ఆ తర్వాత ‘ది కాశ్మీర్ ఫైల్స్’ జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకుంది.

 

 

Exit mobile version