Site icon Prime9

Dirty Picture sequel: ది డర్టీ పిక్చర్‌ కు సీక్వెల్

Bollywood: 2011లో వచ్చిన విద్యాబాలన్ చిత్రం ది డర్టీ పిక్చర్‌విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఒక దశాబ్దం తరువాత, ది డర్టీ పిక్చర్‌కు సీక్వెల్ రూపొందించబడుతుంది. అయితే ఇందులో విద్యాబాలన్ నటిస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.

ది డర్టీ పిక్చర్‌కి సీక్వెల్‌ రూపొందుతుంది. అయితే ఈ సినిమా కోసం విద్యాబాలన్‌ని ఇంకా సంప్రదించలేదు. సినిమా రచన ఇంకా ప్రారంభం కాలేదు అని ఈ సినిమా నిర్మాణ సంస్దకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రూ.18 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ది డర్టీ పిక్చర్‌ బాక్సాఫీస్ వద్ద రూ.117 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మిలన్ లుత్రియా దర్శకత్వం వహించారు. విద్యాబాలన్‌తో పాటు, ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా మరియు తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విద్యాబాలన్ జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.

Exit mobile version