Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అదే కాంబినేషన్ లో మాస్టర్ ని మించేలా ఓ స్టోరీని విజయ్ 67వ మూవీ కోసం ప్లాన్ చేశాడు లోకేష్.
గత కొద్దిరోజులుగా Thalapathy67 వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలో నటిస్తున్న్ నటీనటుల వివరాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వచ్చి సినిమా పై హైప్ క్రియేట్ చేశారు.
తాజాగా చిత్ర యూనిట్ సినిమా అఫీషియల్ టైటిల్ ని అనౌన్స్ చేసింది. ఈ అక్టోబర్ 19 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
అందుకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ రివీల్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్ ను ఖరారు చేయగా.. బ్లడీ స్వీట్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
— Vijay (@actorvijay) February 3, 2023
టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రోమో సూపర్(Thalapathy Vijay)
లియో టైటిల్ తో రూపొందునున్న ఈ మూవీ భారీ థ్రిల్లింగ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
ఈ టీజర్ లో విజయ్ రెండు వేరియేషన్స్ లో కనిపిస్తారు. సిల్వర్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ కు జోడిగా త్రిష నటిస్తోంది. రెండు రోజుల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ కోసం వెళ్లింది.
ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ లుక్స్, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి వెరసి ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ ని తెచ్చిపెడుతున్నాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/