Site icon Prime9

Colors Swathi: విడాకుల బాట మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ – పెళ్లి ఫోటోలు డిలిట్‌

Colors Swathi Divorce Rumours: ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్‌. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ధనుష్‌-ఐశ్వర్య రజనీకాంత్‌ విడిపోయారు. మొన్నటికి మొన్న ఆస్కార్‌ ఆవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడాకులు ప్రకటించి షాకిచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్‌ విడాకుల బాట పట్టినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు కలర్స్‌ స్వాతి. హీరోయిన్‌గా తన క్యూట్‌ క్యూట్‌ మాటలు, డైలాగ్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హీరోయిన్‌గా సినీ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే సడెన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. కేరళకు చెందిన వికాస్‌ వాసును 2018లో పెళ్లి చేసుకుంది. గతంలో ఆమె విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వాటిని స్వాతి కొట్టిపారేసింది. కానీ ఈసారి మాత్రం ఆమె భర్తతో విడిపోయేందుకు సిద్ధమైందనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేసింది. దీంతో ఆమె విడాకులు ఖాయమేనా? అనే సందేహాలు వస్తున్నాయి. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత కలర్స్‌ స్వాతి ‘మంత్‌ ఆఫ్‌ మధు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.

Exit mobile version