Site icon Prime9

Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ప్రోమో రిలీజ్.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటున్న నాగ్ !

famous reality show bigg boss 7 promo released

famous reality show bigg boss 7 promo released

Bigg Boss 7 : ప్రముఖ రియాలిటీ షో “బిగ్ బాస్” గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. ఈ షో కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో కి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే 6 సీజన్లను ముగించుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.

‘స్టార్ మా’లో టెలికాస్ట్ కానున్న ఈ ప్రోగ్రామ్.. డిస్నీప్లస్  హాట్‌స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారు.. ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నాలుగు సీజన్ల నుంచి ఈ షోకి నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేయడం లేదనే పుకార్లు వచ్చాయి.

ఇక ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు అందరి సర్ ప్రైజ్ ఇస్తూ ఓ చిన్న ప్రోమో ని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోతో ఈ సీజన్ కి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా చేయనున్నారని తెలుస్తుంది. ఈ ప్రోమోలో నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తుంది. అని పలు డైలాగ్స్ చెప్పేందుకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఏది సరిగ్గా అనిపించక ఆగిపోతారు. ఇక చివరగా ఈ సారి కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ చెప్పారు. దీంతో ఈ సారి ఏదో కొత్త థీమ్ తో షో ని తీసుకురాబోతున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ గా మారింది.

 

 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. బిగ్‌బాస్ సీజన్ 7 లో పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. వారు ఎవరంటే.. అమరదీప్ – తేజస్విని జంట, సీరియల్ ఆర్టిస్ట్ శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరూ కంటెస్టెంట్లు గా వస్తారో అని.. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రారంభమవుతుందని టాక్ నడుస్తుంది.

Exit mobile version