Site icon Prime9

Jabardasth Comedian : మరింత క్షీణించిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్యం.. అండగా ఏపీ సర్కారు

ap government help for jabardasth comedian punch prasad treatment

ap government help for jabardasth comedian punch prasad treatment

Jabardasth Comedian : జ‌బ‌ర్ద‌స్త్ షోలో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు పంచ్ ప్ర‌సాద్. ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. గత కొంత‌కాలంగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకి వైద్య సేవలు కొనసాగుతున్నాయి. అయితే పంచ్ ప్రసాద్‌కి రెండు కిడ్నీలు చెడిపోవడంతో.. క్రమం తప్పకుండా డయాలసిస్ చేస్తున్నారు. కాగా ఆయనలో మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమించింది. అయితే ఇప్పటికే పంచ్ ప్రసాద్ వైద్యానికి దాదాపు రూ.50 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. దానికి గాను రెగ్యుల‌ర్‌గా డ‌యాసిస్ చికిత్స చేయించుకుంటూ వస్తున్నాడు.

అయితే ఇటీవల ప్రసాద్ కి చాలా సీరియస్ అవ్వడంతో.. డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయాల‌ని సూచించారు. అయితే అది బాగా ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ప్రసాద్ కుటుంబం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియెన్ నూక‌రాజు తన సోషల్ మీడియా ద్వారా ప్రసాద్ కి హెల్ప్ చేయాలంటూ నెటిజెన్స్ ని కోరుతూ బ్యాంకు వివరాలు ఉన్న ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ ని ఒక నెటిజెన్ షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎంవో అధికారిని ట్యాగ్ చేశాడు. ఆ పోస్ట్ కి ఏపీ సీఎంవో రిప్లై ఇచ్చింది.

గతేడాది రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ప్రసాద్ నడవలేని స్థితికి చేరుకున్నాడు. అయితే, ప్రసాద్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నందున, అతని ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి వెంటనే శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు కోసం దాతల నుంచి ఆర్థిక సహాయం కోరారు. ఆర్థిక సహాయం అందించడానికోసం.. ప్రసాద్ భార్య బ్యాంక్ వివరాలు మరియు ఫోన్ నంబర్‌ ను పంచుకున్నారు. అతనితో పాటు హైపర్ ఆది, గెటప్ శ్రీను, పలువురు కమెడియన్లు ప్రసాద్ కి సహాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

ఇప్పటికే పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో సీఎంవో టీం టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. వారి చేత లెటర్‌ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు.. అది అప్లై చేయగానే వెంటనే డాక్యుమెంట్లను పరిశీలించి సర్జరీకి అవసరమైన సహాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ రిప్లై చూసిన నెటిజెన్స్ ఏపీ ప్రభుత్వం స్పీడ్ గా ఆ ప్రక్రియ పూర్తి చేసి ప్రసాద్ కి ఆరోగ్యం బాగుపడేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా గతంలో జబర్దస్త్ జడ్జిగా చేసిన సంగతి అందరికి తెలిసిందే. అందుకే ప్రసాద్ విషయంలో మంత్రి రోజా కొంచెం చొరవ తీసుకోని సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Exit mobile version