Site icon Prime9

Teja Sajja: ‘ఐఫా’ వేడుకలో కాంట్రవర్సల్‌ కామెంట్స్‌ – స్పందించిన రానా, తేజ సజ్జా

Teja Sajja on IIFA Controversy: ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో హీరో రానా, తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వారు వ్యాఖ్యతలు వ్యవహరించిన వారు స్టార్‌ హీరోలపై జోకులు, సినిమాలపై సటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ముఖ్యం మిస్టర్‌ బచ్చన్‌పై ప్లాప్‌పై వీరు కామెడీ చేస్తూ మాస్‌మహారాజా అభిమానులను హర్ట్‌ చేశారు. దీంతో వీరిపై అభిమానులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇది కాస్తా ఎక్కువ అవుతుండటం తేజ సజ్జా స్పదించాడు. రీసెంట్‌గా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. అతడు స్పందిస్తూ.. ఐపా వేడుకలో సరద కోసమే అలా మాట్లాడమని. ఫుల్‌ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందని వివరణ ఇచ్చాడు.

ఐఫా అవార్డులు అనేవి నేషనల్‌ ఈవెంట్‌. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్స్‌ రైటర్స్‌ ఉంటారు. అన్ని విధాలుగా చెక్‌ చేసిన తర్వాతే ఆ స్క్రిప్స్‌ని హోస్ట్స్‌ చేతికి వస్తాయి. అప్పుడు మాకు వచ్చిన దాన్నే మేం ఫాలో అయ్యాము. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న క్లిప్స్‌ కట్ చేసినవి. ఫుల్‌ వీడియో చూస్తే తెలుస్తుంది. నేను చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతోమంది హీరోలతో నటించాను. స్టార్‌ హీరోలను చూస్తూ పెరిగాను. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. నాకు ఎందరో హీరోలతో మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు.

నిజానికి ఈవెంట్‌లో రానా మొదటి నుంచి ఫన్నీగానే మాట్లాడారు. ఆయన నాపై జోకులు వేశారు. మా వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు” అంటూ తేజ సజ్జా చెప్పకొచ్చాడు. అలాగే రానా కూడా ఈ వివాదంపై స్పందించారు. జోక్‌గా మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుందంటూ తన హోస్ట్‌ వ్యవహరిస్తున్న షోలో పేర్కొన్నారు. తాజాగా ఇందకు సంబంధించిన ప్రోమో విడుదల అవ్వగా అందులో నాని గురించి చెబుతూ ఈ కాంట్రవర్సీకి చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. “నాని నాకోక సలహా ఇచ్చాడు. నెక్ట్స్‌ టైం నేను జోక్స్‌ వేస్తున్నప్పుడు ఇది జోక్‌ అని సబ్‌టైటిల్స్‌ వెయించు.

లేకపోతే అది జోక్‌ అని ఎవరికీ అర్థం కావడం లేదు” అని సూచించాడంటూ రానా ఫన్నీగా చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా జరిగిన ఐఫా ఈవెంట్‌కు రానా, తేజ సజ్జాలు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో తమ ఫన్నీ స్పీచ్ అక్కడి వారిని ఆకట్టుకునే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ఈ ఏడాది బచ్చన్‌ గారు హైస్‌ చూశారు లోస్‌ కూడా చూశారనగా.. తేజా హై అంటే కల్కి మూవీ హిట్‌.. మరి లో అంటే అదే మిస్టర్‌ బచ్చన్‌ ప్లాప్‌ అని రానా అనగానే.. సరే సరే అంటూ తేజ సజ్జా మాట్లాడాడు. దీనిపై డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కూడా స్పందించాడు. ఎవరు ఏం అనుకున్నా అనుకోని.. అన్ని రోజులు ఓకేలా ఉండవు అంటూ ఈ క్లిప్ పోస్ట్‌పై స్పందించాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ వివాదానికి దారి తీసింది.

Exit mobile version