Tarakaratna: నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భర్త దూరం కావడంతో తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి ముగ్గురు బిడ్డలతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఫిబ్రవరి 22 న తారక రత్న 40వ పుట్టినరోజు. కానీ దురదుష్టవశాత్తూ ఆయన పుట్టిన రోజుకు మూడు రోజుల ముందు కన్నుమూయడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ నెల 18న తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. దానిని గుర్తు చేసుకుని తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.
చాలా మిస్సవుతున్నాం: అలేఖ్య రెడ్డి(Tarakaratna)
తారక రత్న, తన కూతరు నిష్కతో ఉన్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన అలేఖ్యరెడ్డి ‘ నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త, మంచి మనసున్న వ్యక్తివి. హ్యాపీ బర్త్ డే.. నిన్ను చాలా మిస్సవుతున్నాం’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఆమె పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఫ్యాన్స్ ‘నిన్ను చాలా మిస్ అవుతున్నాం’ తారకరత్న అనే పోస్టులు పెడుతున్నారు.
గత నెల 26 ను నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. సమీప ఆస్పత్రిలో చికిత్స అందించగా, మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ 23 రోజులుగా చికిత్స పొందిన ఆయన ఈ నెల 18న తుది శ్వాస విడిచారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన చిన్న కార్యక్రమం జరిగింది.