Site icon Prime9

Sudigali Sudheer: సుధీర్ “గాలోడు” చిత్రం ట్రైలర్ అదిరింది

sudigali sudheer galodu movie official trailer out

sudigali sudheer galodu movie official trailer out

Sudigali Sudheer: జబర్దస్త్ యాక్టర్ మరియు యాంకర్ సుడిగాలి సుధీర్ తెలియని తెలుగువారండరు. కాగా ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి ఈ నటుడు అనేక ప్రోగ్రాంలు చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నాడు. కాగా సుడిగాలి సుధీర్ హీరోగా న‌టిస్తోన్న తాజాగా తెరకెక్కుతున్న ప‌క్కా మాస్ అండ్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటించింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి విశేష ఆదర‌ణ ల‌భించింది. న‌వంబ‌రు 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా `గాలోడు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను గ్రాండ్ గా విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.

దాదాపు రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. మొదటిసారిగా సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో అదిరిపోయేలా ఉన్నాయి. ఒక‌వైపు మాస్ మ‌రోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు సుధీర్. ఇక ఈ ట్రైలర్లోని పంచ్ లైతే నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఇక “వ‌య‌సు త‌క్కువ `షో`లు ఎక్కువ‌, నువ్వు శ‌నివారం పుట్టావా? శ‌నిలా త‌గులుకున్నావ్‌, రామాయ‌ణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్క‌డ అంద‌రు మాయ లేడీలే.. వంటి డైలాగ్స్‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తూనే `వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌ర్‌రా వాడు, వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి. ఇకపోతే గెహ్నాసిప్పి గ్లామ‌ర్‌, స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ ట్రైల‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రాంప్ర‌సాద్ విజువ‌ల్స్ అందించగా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు.

ఇదీ చదవండి: షిర్లీ సెటియా నోట.. “ఏముంది రా” పాట

Exit mobile version