Site icon Prime9

Nandamuri Balakrishna: బాలయ్యను ఒప్పించడానికి బరిలోకి బడా నిర్మాతలు

Tollywood: యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, దీనికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు ఇచ్చింది. అయితే, చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు మరియు నిర్మాతలు కొందరు ఈ చర్యను వ్యతిరేకించారు. ఈ నిర్ణయం షూటింగ్ దశలో ఉన్న చిత్రాలకు అదనపు భారం అని పేర్కొన్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న NBK 107 సినిమా షూటింగ్ ఆపడానికి నందమూరి బాలకృష్ణ నిరాకరించినట్లు సమాచారం. సినిమా షూటింగ్‌ని ఎలాంటి హాల్టు లేకుండా కొనసాగించాలని బాలయ్య తన నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతల మండలి మరియు గిల్డ్‌కి మింగుడు పడలేదు.

తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణను ఒప్పించడానికి మరియు అతని సినిమా షూటింగ్‌ని ఆపడానికి సీనియర్ నిర్మాతలతో కౌన్సిల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడానికి గల కారణాలను, లాజిక్‌లను, దీర్ఘకాలంలో నిర్మాణ వ్యయాన్ని నియంత్రించాలనే డిమాండ్‌లను కమిటీ సభ్యులు వివరించడానికి సిద్దమయ్యారు. ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్యను ఈ కమిటీ ఎంతవరకు కన్విన్స్ చేస్తుందో చూడాలి.

Exit mobile version