Site icon Prime9

Richi Gadi Pelli: రిచీ గాడి పెళ్లి మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్.. మీరు చూసేయండి

richi gadi pelli

richi gadi pelli

Richi Gadi Pelli: నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. కెఎస్ హేమరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా మానవ సంబంధాలకు అద్దం పట్టే విధంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

 

కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఇప్పుడు ఆదరణ ఉంటోంది. ఓటీటీలు, థియేటర్లు అనే తేడా లేకుండా కొత్త కథలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే రిచి గాడి పెళ్లి అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనేది అర్థం అవుతోంది.

Exit mobile version