Jung Kook Singing Naatu Naatu Song : బీటీఎస్.. (“బియాండ్ ది సీన్”) అని పిలువబడే ఈ దక్షిణ కొరియా బాయ్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కొరియన్ డ్రామాలు, కొరియన్ సాంగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. కే పాప్స్ గా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యాండ్స్ అనేకం ఉన్నాయి. అయితే వీటిల్లో బిటిఎస్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బీటిఎస్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన అతిపెద్ద మ్యూజిక్ బ్యాండ్. BTS తన మొదటి పాటను 9 సంవత్సరాల క్రితం అంటే 12 జూన్ 2013న విడుదల చేసింది. ఇప్పటివరకు BTS అనేక అవార్డులను గెలుచుకుంది.
అయితే వరల్డ్ ఫెమస్ అయిన ఈ బీటీఎస్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ బీటీఎస్ లోని ఒక సింగర్ కు అయిన జుంగ్ కుక్ కి కూడా భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. అభిమనులంతా ఇతన్ని ముద్దుగా జేకే అని పిలుచుకుంటారు. కాగా జేకే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోసం లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ లైఆవ సెషన్ లో నాటు నాటు సాంగ్ ప్లే చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న జేకే మన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట హమ్ చేయడం, స్టెప్పు వేయడం పట్ల అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. దీంతో గత రాత్రి నుంచి సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డు వేడుకలో నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. నాటునాటుకు ఆస్కార్ రావాలని ఇండియన్స్ అంతా కోరుకుంటున్నారు. అవార్డుల ప్రదానోత్సవం వేడుకలో ఆర్ఆర్ ఆర్ చిత్ర యూనిట్ పాల్గొననుంది. ఈనెల 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానవోత్సవం జరగనుంది.
ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన ఈ పాట.. ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఇక ఇప్పటికే ఈ పాట ఆస్కార్ బరిలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ రోజు ఈ పాటని లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు అకాడమీ తమ సోషల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మార్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుండడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం అని చెప్పాలి. ఇప్పుడు జేకే నోట కూడా ఈ పాట రావడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.
#JKLive #BTS #RRRMovie #NaatuNaatu #JUNGKOOK #JK #Tollywood
Tq #JUNGKOOK for watching @RRRMovie and ur response on Natu Natu Song.. he & Mee had one thing in common .. that our Names in Short form Jaya Kumar (JK) & Jung Kook (JK) https://t.co/QcXkSQRDc0
— Jaya kumar (@jaya94337) March 3, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/