Site icon Prime9

Soundarya Rajinikanth: రజినికాంత్ కుటుంబంలో మరో వారసుడు

rajinikanth prime9news

rajinikanth prime9news

Kollywood: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్‌ మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సౌందర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుడి దయతో వేద్ బుజ్జి తమ్ముడుకు నేను, విషాగన్, వేద్ కలిసి నీకు స్వాగతం చెప్పడం నాకు సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో వేదిక ద్వారా ఈ విషయాన్ని మన అందరితో పంచుకున్నారు. అప్పుడే ప్రసవించిన ఈ బుజ్జి బాబుకు ” వీర్ రజనీకాంత్ వనంగమూడి ” అంటూ పేరు కూడా పెట్టేశారు. తన ప్రసవంలో సహాయం చేసిన వైద్యలందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య అశ్వినీ రామ్ కుమార్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్తను 2010 లో ఆమె పెళ్లాడింది. అయితే వీరిద్దరికీ వేద్ కృష్ణ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏడేళ్ళు మాత్రమే కలిసున్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య భిన్నాభిప్రయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం 2019లో ఆమె విశాగన్ వనంగమూడి అనే ఇంకో వ్యాపారవేత్తను రెండో పెళ్ళి చేసుకొని ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చారు. మన అందరికీ తెలియని విషయం ఏంటంటే తండ్రి రజనీకాంత్ నటించిన కొన్ని సినిమాలకు ఈమె గ్రాఫిక్ డిజైనర్ కూడా పనిచేసింది.

 

Exit mobile version