Site icon Prime9

Sitaram Collections: వీకెండ్ లో రూ.25 కోట్లు వసూలు చేసిన ’సీతారామం‘

Sitaram Collections: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సీతా రామం చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది. దీనితో ఈ చిత్రం మొత్తం వీకెండ్ లో రూ.24.20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

దక్షిణాది రాష్ట్రాలు మరియు ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల పాటు ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ) – 12. 77 కోట్లు
కర్ణాటక: 1.75 కోట్లు
కేరళ – 2.14 కోట్లు
తమిళనాడు – 1.60 కోట్లు
ఓవర్సీస్ – 6 కోట్లు

సోమవారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది.

Exit mobile version