Site icon Prime9

Sitara Ghattamaneni: మోడర్న్‌ లిటిల్‌ ప్రిన్సెస్‌.. మరోసారి న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో సితార ఫోటోలు

Sitara New Campaign with PMJ Jewellers: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు వెకేషన్‌ ఫోటోలు డ్యాన్స్‌ వీడియోలు షేర్‌ చేస్తూ సో షల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ ఉంటుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సితూ పాపకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అలా అతి చిన్న వయసులోనే సోషల్‌ మీడియా సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌గా సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే గతంలో సీతార పీఎంజే జ్యూవెల్లరి యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే.

ఇది తన మొదటి వాణిజ్య ప్రకటన. చిన్న వయసులోనే ప్రకటనలో నటించిన స్టార్‌ కిడ్‌ సితార రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు ధరించి కుందనపు బొమ్మల మెరిసిన సితార ఫోటోలను పీఎంజే జ్యూవెల్లర్స్‌ వారు న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వైర్‌లో ప్రదర్శించారు. సినిమాల్లోకి రాకముందే ఇంటర్నేషనల్‌ స్థాయిలో గుర్తింపు పొంది తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. మరోవైపు తల్లిదండ్రుల బాటలోనే తన సామాజిక సేవల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంది. పీఎం జ్యూవెల్లరి యాడ్‌లో నటించినందుకు గాను తను తీసుకున్న మొదటి రెమ్యునరేషన్‌ని చారిటీకి ఇచ్చింది. ఈ విషయాన్ని సితార స్వయంగా ఓ ఇంటర్య్వూలో చెప్పింది.

తాజాగా ఇదే విషయాన్ని పీఎంజే జ్యూవెల్లరి వారు కూడా స్పష్టం చేశారు. తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సితారతో సరికొత్త క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన ఈ సంస్థ సితార ఉదార మనసు గురించి చెప్పారు. తన ప్రకటనలో నటించినందుకుగాను తీసుకున్న రెమ్యునరేషన్‌ను తను తీసుకోకుండ ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌కి ఇచ్చారని పీఎంజే పేర్కొన్నారు. అలాగే సితారతో సరికొత్త జ్యూవెల్లరి క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు పీఎంజే జ్యూవెల్లర్స్‌ వారు ఓ ప్రకటన ఇచ్చారు. గ్రేస్, ఛార్మ్ కలగలిసిన మోడర్న్ లిటిల్ ప్రిన్సెస్ సితార తమ పీఎంజే జ్యూవెల్లరి విశిష్టతను, ప్రత్యేకతను ప్రతిబింబిస్తోందని సదరు కంపెనీ పేర్కొంది.

Sitara Ghattamaneni PMJ Jewellery At Time Square, New York

ఈ క్యాంపెయిన్‌లో సరికొత్త కలెక్షన్‌ ఆభరణాలు భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని కళ్లకు చూపిస్తున్నాయి. పచ్చలు, వజ్రాలు, కెంపులతో అద్దిన, అత్యాధునికంగా, కళాత్మకంగా తయారైన ఎన్నోరకాలు డిజైన్ల కలెక్షన్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. పెళ్లి నగలతో పాటు వివిధ వేడుకలకు ధరించేందుకు అనువుగా ప్రత్యేకమైన ఆభరణాలను కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పీఎంజే జ్యువెల్స్ లేటెస్ట్ కలెక్షన్ ఆభరణాలు ధరించిన సితార ఫొటోలను టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించామని, తమ లేటెస్ట్ క్యాంపెయిన్ ద్వారా భారతీయ నగల విశిష్టత, ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకోబోతున్నారని పేర్కొన్నారు. కళాత్మకమైన ఆభరణాల ప్రత్యేకతను చాటిచెప్పడమే కాకుండా భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ క్యాంపెయిన్ నిర్వహించామని పీఎంజే తెలిపింది.

Exit mobile version
Skip to toolbar