Site icon Prime9

Miss You OTT: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన సిద్ధార్థ్‌ ‘మిస్‌ యూ ‘ – స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Miss You Now Streaming on OTT: ఈ మధ్య సిద్ధార్థ్ లవ్‌ ట్రాక్‌ కంటే సీరియస్‌ కథలను ఎంచుకుంటున్నాడు. గతేడాది చిన్నా అంటూ రా అండ్‌ రస్టిక్‌ స్టోరీతో వచ్చిన అతడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్‌ 2 కీలక పాత్రలో మెరిశాడు. ఈ చిత్రంతో భారీ డిజాస్టర్‌ చూసిన సిద్ధార్థ్‌ మిస్‌ యూ అనే రొమాంటి లవ్‌స్టోరీతో వచ్చాడు.

గతేడాది డిసెంబర్‌ 13న విడుదలైన ఈ చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత సిద్ధార్థ్‌గా లవర్‌ బాయ్‌గా వస్తున్నాడని తెలిసి ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే చిత్రంలో పెద్దగా ఆకట్టుకునే కంటెంట్‌ లేకపోవడంతో ఆడియన్స్‌ ఆదరణ కరువైంది. ఇక అదే టైంలో పుష్ప 2 మూవీ థియేటర్‌లో రన్‌ అవుతుండటంతో ఈ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ మూవీ కలెక్షన్స్‌ పరంగానూ నిరాశపరిచింది.

థియేట్రికల్‌ రన్‌ ప్లాప్‌గా నిలిచి ఈ చిత్రం సైలెంట్‌గా బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు మిస్‌ మూ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. డిజిటల్‌ ప్లాట్‌ఫాంకి సైతం సైలెంట్‌గానే వచ్చింది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. సిద్ధార్థ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. ఎన్‌ రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 7 మైల్స్‌ పర్‌ సెకండ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో శామ్యూల్‌ మాథ్యూ నిర్మించారు. జిబ్రాన్‌ సంగీతం అందించారు.

Exit mobile version