Site icon Prime9

Kamal Haasan: కమల్‌ హాసన్‌ బర్త్‌డే – నువ్వు అరుదైన రత్నం అప్పా.. తండ్రికి శ్రుతి హాసన్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

Shruti Haasan Birthday Wishes Kamal Haasan: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ బర్త్‌డే 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇవాళ (నవంబర్‌ 7) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌కు శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఆయన బర్త్‌డే సందడే కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు,నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే ఆయన కూతురు, స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ స్పెషల్‌ విషెస్‌ చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది.

“హ్యాపీ బర్త్‌డే అప్పా. మీరు ఈ ప్రపంచంలోనే అరుదైన రత్నం (Rare Diamond)అప్పా. మీ కుమార్తెగా మీ పక్కన నడవడం నాకు ఇష్టమైన వాటిలో ఒకటి. అవును. మీరు దేవుడిని నమ్మరని తెలుసు.. కానీ, మీరు ఎల్లప్పుడూ ఆయన/ఆమె ఎంచుకున్న బిడ్డగా ఉంటారు. అలాగే మీ చేసే అన్ని మ్యాజికల్‌ మూమెంట్స్‌ని చూసేందుకు ఉత్సాహంతో ఉంటాను. మీరు మరెన్నో పుట్టిన రోజుల జరుపుకోవాలి. మరెన్నో కలలు సాకారం చేసుకుంటూ ఎప్పుడూ వేడుక చేసుకోవాలని” అంటూ తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలిపింది శ్రుతి హాసన్‌.

కాగా శ్రుతి హాసన్‌ మల్టీటాలెంటెడ్‌ హీరోయిన్‌ అనే విషయంలో తెలిసిందే. తండ్రి నట వారసురాలికి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నటనలోనే కాదు డ్యాన్స్‌, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాదు పలు అల్భమ్‌ సాంగ్స్‌ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కూడా చేస్తుంది. ఇలా అన్ని అన్ని రంగాల్లో రాణిస్తూ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ కొనసాగుతుంది. ఇటీవల శ్రుతి సలార్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె సలార్‌ 2 సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది.

Exit mobile version