Site icon Prime9

Shazahn Padamsee: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌

Shazahn Padamsee Roka Photos: రామ్‌ చరణ్‌ ఆరెంజ్‌ హీరోయిన్ షాజన్‌ పదంసీ గుడ్‌న్యూస్‌ చేప్పింది. ప్రియుడితో పెళ్లికి సిద్ధమైనట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె రోకా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ పెళ్లి కబురు చెప్పింది. జనవరి 20న కొత్త ప్రయాణం మొదలైందంటూ రోకాకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేసింది. దీనికి #Roka, #engagement ల హ్యాష్ ట్యాగ్‌లు జత చేసింది. రోకా ఫంక్షన్‌ జవనరి 20న జరిగినట్టు వెల్లడించింది.

కాగా గతేడాది నవంబర్‌లో షాజన్‌ ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆశిష్‌ తనకు ప్రపోజ్‌ చేసి వేలికి రింగ్‌ తొడినట్టు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేసింది. కాగా రామ్‌ చరణ్‌ ఆరెంజ్‌ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది. కనిపించింది కాసేపే అయిన తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. రుభా రుభా పాటలో షాజన్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంది.  షాజన్‌ పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘రాకెట్‌ సింగ్‌: సేల్స్‌మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

కనిమొళి అనే తమిళ సినిమాలో నటించిన ఆమె దిల్‌ తో బచ్చా హై జీ, హౌజ్‌ఫుల్‌ 2 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఆరెంజ్‌లో సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన నటించి ఆమె ఆ తర్వాత రామ్‌ పోతినేని మసాలా చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత 2015లో సాలిడ్‌ పటేల్స్‌(హిందీ) మూవీలో నటించి ఆమె తర్వాత నటనకు దూరమైంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్‌ తర్వాత పాగల్‌ పన్‌: నెక్ట్స్‌ లెవల్‌ (2023) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

Exit mobile version