Site icon Prime9

Shahrukh Khan : గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్.. తన అభిమాని కోసం !

shahrukh khan good gesture towards his fan goes viral

shahrukh khan good gesture towards his fan goes viral

Shahrukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) మరోసారి మంచి గొప్ప మనసుని చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని కోరిక తెలుసుకొని నెరవేర్చాడు. ఈ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన శివానీ చక్రవర్తి వయస్సు 60 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆమె అనారోగ్యంతో పోరాడుతూ.. రోజులు లెక్కబెట్టుకుంటుంది. నెలలు మాత్రమే ఆమె బ్రతికి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఆమెకు షారుఖ్ ఖాన్ అంటే ఎంతో అభిమానం అంట.

దాంతో షారుఖ్ ని ఒక్కసారైనా కలవాలని, తన చేతివంటని షారుఖ్ రుచి చూపించాలని ఎంతో ఆశపడేది. ఇక ఆమె కోరిక తెలుసుకున్న ఆమె కూతురు ఎలాగైనా ఆ కోరిక నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదికాస్త షారుఖ్ వరకు చేరుకోవడంతో.. ఆ అభిమాని కోరిక తీర్చేందుకు షారుఖ్ (Shahrukh Khan) స్వయంగా వీడియో కాల్ చేసి శివానీ చక్రవర్తిను సంతోషపరిచాడు. దాదాపు 40 నిముషాలు పాటు ఆమెతో వీడియో కాల్ మాట్లాడాడు. అలాగే త్వరలోనే తన ఇంటికి వస్తానని, తన చేతి వంట తింటానని శివానీకి మాట ఇచ్చాడు. అలాగే ఆమె క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఆర్ధిక సహాయం చేస్తానంటూ షారుఖ్ హామీ ఇచ్చారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షారుఖ్ ని నెటిజెన్స్ అందరు అభినందిస్తున్నారు.

 

కాగా షారుఖ్ (Shahrukh Khan) ప్రస్తుతం జవాన్, డంకీ సినిమాల్లో నటిస్తున్నాడు. జవాన్ సినిమాని సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోనే అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ ఉండబోతుందని సమాచారం. అయితే ఇటీవలే షారుఖ్‌ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన పఠాన్ మూవీ మనకి విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మోత మోగించింది.  ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.  సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా నటించారు.

Exit mobile version