Sankranthiki Vasthunam Box Office Day 5 Collection:విక్టరి వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద దూకుడు చూపిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా బ్లాకబస్టర్ పొంగల్‌గా నిలిచింది. ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ అందుకుంది. చరణ్, బాలయ్యను వెనక్కి నెట్టి ఈ సంక్రాంతి విజేత నిలిచాడు వెంకీమామ.
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. దీంతో రీపెటెడ్ ఆడియన్స్ వస్తుండటంతో కలెక్షన్స్‌లో ముందంజలో ఉంది ఈ చిత్రం. డాకు మహారాజ్ వంటి భారీ యాక్షన్ మూవీ పోటీ ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద సంక్రాంతికి వస్తున్నాం సినిమాదే హవా కనిపిస్తుంది. మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా అయిదు రోజుల్లో రూ. 161 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది.
‘డాకు మహారాజ్’ ఆరు రోజుల రూ. 124 కోట్లు గ్రాస్ చేయగా.. సంక్రాంతికి వస్తున్నాం ఐదు రోజుల్లోనే రూ. 161 పైగా కోట్ల వసూళ్లు చేసింది. ఇక వీకెండ్ ఉండటంతో ఈ వసూళ్లు మరింత పుంజుకునేలా కనిపిస్తుంది. దీంతో సెకండ్ వీకెండ్‌లోగా ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరుతుందనడంలో సందేహం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష్ ఈ సినిమా నిర్మించారు.
A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥
All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥
— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e
— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025
కథేంటంటే..
అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో అయిన మన తెలుగు వ్యక్తి సత్యా ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) ఇండియాకు వస్తాడు. దీంతో ఆయనను మొదట తమ స్టేట్‌కే రప్పించుకునేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు పోటీపడతారు. అలాగే కేంద్రం సత్యా ఆకేళ్ల రప్పించుకుని ఆయనతో వ్యాపార డిల్ మాట్లాడకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ తన సొంత రాష్ట్రమైన తెలంగాణకే మొదటి ప్రిఫెరెన్స్ ఇచ్చి ఇక్కడకు వస్తాడు. తెలంగాణ సీఎం పాత్ర పోషించిన నరేష్ సత్యా ఆకేళ్లతో సమావేశం అవుతారు. అయితే ఆయనకు పర్సనల్‌గా ఇచ్చిన విందు కార్యక్రమంలో అతడు కిడ్నాప్‌కు అవుతాడు.
ఈ విషయం బయటకు తెలియకుండ గుప్పుచప్పుడు కాకుండ ఆయనను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసు ఆఫీసర్ మీనాక్షి చౌదరితో సీఎం సీక్రెట్ ఆపరేషన్ నడుపుతాడు. దీనికి ధైర్యవంతుడైన, మంచి ట్రాక్ రికార్డు ఉన్న పోలీసు ఆఫీసర్ కావాలని వెతుకుతుండగా.. ఐజీ వెంకటేష్ గురించి చెబుతారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వెంకటేష్‌ను ఈ సీక్రెట్ ఆపరేషన్‌కి ఎలా ఒప్పించారు? మీనాక్షి చౌదరిని ప్రేమించిన వెంకటేస్ ఐశ్వర్య రాజేష్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఇంతకి ఈ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది సంక్రాంతికి వస్తున్నాం కథ.