Site icon Prime9

సంజయ్ దత్: ప్రభాస్ తాతగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్.. ఏ సినిమా అంటే..?

Sanjay Dutt

Sanjay Dutt

Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. చాలా రోజుల నుంచి సంజయ్ దత్ టాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం అతను ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మారుతీ కథనం సంజయ్ దత్‌కి నచ్చి సినిమాకు సంతకం చేసారని సమాచారం.

ఫిబ్రవరి 2023 నుండి సినిమాకు డేట్స్ కేటాయించారు. ఈ హారర్ కామెడీలో ప్రభాస్ తాతగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో తాత మరియు మనవడి మధ్య బంధం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేకర్స్ ఆ పాత్ర కోసం సంజయ్ దత్‌ని సంప్రదించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి బామ్మగా బాలీవుడ్‌ నటి జరీనా వహాబ్‌ నటిస్తోంది. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

వచ్చే ఏడాది మొదట్లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు మారుతి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ సాలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు.

Exit mobile version
Skip to toolbar