Site icon Prime9

Samuthirakani first look: మాచర్ల నియోజకవర్గంలో విలన్ గా సముద్రఖని

Tollywood: హీరో నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గంలో చిత్రంలో సముద్రఖని రాజప్ప అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సినిమాలోని అతని లుక్‌ని గురువారం విడుదల చేసారు.సముద్రఖని ఎవరివైపో సీరియస్‌గా చూస్తూ పేపర్‌పై సంతకం చేస్తూ కనిపించాడు. అతని గెటప్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, లుక్స్ భయపెడుతున్నట్లు వున్నాయి.

ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అన్ని హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అంజలి నటించిన ఐటెమ్ నంబర్ ఇంటర్నెట్‌ లో వైరల్ అయింది. నితిన్ మరియు అంజలి ఇద్దరూ తమ డ్యాన్స్ తో అదరగొట్టారు.సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న మాచర్ల నియోజక వర్గం ఆగస్ట్ 12న విడుదల కానుంది.

Exit mobile version