Site icon Prime9

Salman Khan: కేసు వదిలేయమని సల్మాన్‌ ఖాన్‌ డబ్బులు ఆఫర్‌ చేశాడు, బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు

Salman Khan Offered Money To Lawrence Bishnoi: బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం భయం గుప్పిట్లో రోజులు గడుపుతున్నారు. గత కొన్నేళ్లు సల్మాన్‌ ఖాన్‌ గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. సల్మాన్‌కు హత్య చేసి తీరుతామంటూ లారెన్స్ బిష్ణోయ్‌ అతడి బృందం వరుస బెదిరింపులకు పాల్పడుతుంది. 1999లో సల్మాన్‌ ఖాన్‌ కృష్ణజింకను వేటాడి చంపినట్టు ఆరోపణలు రాగా.. 2018లో ఈ కేసులో ఆయన దోషిగా తేలాడు.

దీంతో అప్పటి నుంచి బిష్ణోయ్‌ వర్గం వారు సల్మాన్ ఖాన్‌ టార్గెట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా లారెన్స్‌ బిష్ణోయ జైల్లో ఉండి కూడా సల్మాన్‌ను చంపేస్తామంటూ బహిరంగంగ హెచ్చరించాడు. తాజాగా ఈ అంశంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు రమేష్‌ బిష్ణోయ్‌ స్పందించారు. ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో రమేష్‌ బిష్ణోయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సల్మాన్‌కు వదిలేమని ఆయన తండ్రి సలీం ఖాన్‌ డబ్బులు ఆఫర్ చేశాడన్నారు. బిష్ణోయ్‌ వర్గమంత లారెన్స్‌కు మద్దతుగా ఉందని, సల్మాన్‌ ఖాన్‌పై తమ వర్గం ప్రజలంతా ఆగ్రహంతో ఉందన్నారు. తాము దైవంగా కోలిచే కృష్ణజింకను వేటాడి చంపిన అతడిని బిష్ణోయ్‌ కమ్యునిటీ ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు.

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. “సల్మాన్‌ ఖాన్‌ కృష్ణజింక వేటాడి చంపినప్పుడు మా వర్గం ప్రజల రక్తం రగిలిపోయింది. మా కమ్యునిటీ ఎప్పటికీ అతడి క్షమించదు. ఈ సంఘటనపై లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా కోపంతో రగిలిపోయాడు. అప్పుడే అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో మా బిష్ణోయ్‌ వర్గం ప్రజలంతా లారెన్స్‌కి సపోర్టుగా ఉంది. అయితే ఈ కేసులో తమ కొడుకుని వదిలిపెట్టమని సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ మాకు డబ్బులు ఆఫర్‌ చేశారు. బ్లాంక్‌ చెక్‌పై సంతకం చేసి ఇచ్చారు. కానీ, ఆయన ఆఫర్‌ని మా వర్గం తిరస్కరించింది” అని రమేష్‌ బిష్ణోయ్‌ వెల్లడించారు. కాగా గతంలో సల్మాన్‌ ఖాన్‌ తండ్రి డబ్బుల కోసమే లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి అనుచరులు ఇలా చేస్తున్నారని, తన కుమారుడి బెదిరిస్తున్నారంటూ బహిరంగ వ్యాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కామెంట్స్‌పై స్పందిస్తూ అతడు వివరణ ఇచ్చారు. అలాగే జైల్లో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ సౌకర్యాలు, అవసరాల కోసం తమ కుటుంబం ఏడాదికి రూ. 40 లక్షలు ఖర్చు పెడుతుందని కూడా స్పష్టం చేశారు.

Exit mobile version