Saif Son Took Him to Hospital in Auto: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో గురువారం తెల్లవారు జామును చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసి అతడిని పట్టుకునేందుకు యత్నించగా దుండగుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు కావడంతో రక్తస్రావం జరిగింది. దీంతో హుటిహుటిన ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సైఫ్ ని ముంబై లీలావతి ఆస్పత్రికి తరలించారు.
అయితే తండ్రిని ఇబ్రహిం ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ సమయంలో ఇంటి వద్ద కార్లు సిద్ధంగా లేకపోవడం ఇబ్రహీం తండ్రిని ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి చేతి గాయపడ్డ సైఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నారు. కత్తి పోట్లు తాకడంతో ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. ఈ ఘటనపై సినీ ప్రముఖుల స్పందిస్తున్నారు.
సైఫ్ కి ఇలా జరిగిందని తెలిసి షాకయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే చిరంజీవి కూడా సైఫ్ పై దాడి జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి సైఫ్ అలీఖాన్ ని పరామర్శించారు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం లీలావతి ఆస్పత్రి వైద్యులు ఆయన హెల్త్ బులిలెట్ విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ కి ప్రాణాపాయం తప్పిందన్నారు. ఈ ఘటన సైఫ్ వెన్నుముకకు తీవ్ర గాయమైందని, సర్జరీ చేసి వెన్నుముక నుంచి కత్తిని తొలగించినట్టు చెప్పారు.