Sai Dharam Tej : టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో దూసుకుపోతూ మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ్ విభిన్న కథలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం, సుప్రీం, చిత్రలహరి, ప్రతీరోజు పండగే సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. కాగా యాక్సిడెంట్ కారణంగా ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సాయి నటిస్తోన్న చిత్రం విరూపాక్ష. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మరి ఈ ఈవెంట్ కి ఎవరు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను – సాయి తేజ్ (Sai Dharam Tej)
గత కొద్ది రోజులుగా తేజ్ పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అని యాంకర్ ప్రశ్నించారు. అందుకు బదులుగా పెళ్లి గురించి తేజ్ మాట్లాడుతూ.. “ఎవరో అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను. నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను ” అని అన్నారు. ఇక తన జీవితంలోనూ బ్రేకప్ జరిగిందని.. ఓ అమ్మాయిని ప్రేమించిన తర్వాత విడిపోయామని.. ఆ తర్వాత అమ్మాయిలు అంటేనే తనకు భయం వేస్తుందని.. బ్రేకప్ తర్వాత సైలెంట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మరోవైపు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో చేయనున్న సినిమాని ఇటీవలే అఫిషియల్ గా ప్రకటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన “వినోదయ సిత్తం” అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తన షూటింగ్ ని ఇటీవలే పూర్తి కూడా చేసినట్లు సముద్రఖని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. అంతకు అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ఎవడు సినిమా చేయగా.. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మెగా హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మామ – అల్లుళ్ళు ఈ చిత్రంతో ఏ రేంజ్ హిట్ కొడతారో అని..