Site icon Prime9

RRR Documentary: ఓటీటీకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డాక్యుమెంటరీ – స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడంటే

RRR Documentary OTT Release Date Out: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు మల్టీస్టారర్లుగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్‌ అవార్డునే తెచ్చిపెట్టింది. ఇందులో నాటూ నాటూ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కెటగిరిలో ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది. అప్పటి తెలుగు ఇండస్ట్రీకి అందని ద్రాక్షల ఉన్న ఆస్కార్‌ని  అందించిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

ఇక ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై డాక్యుమెంటరీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind and Beyond) పేరుతో డాక్యుమెంటరీని రూపొదించారు. ఇందులో సినిమాలో నటించిన నటీనటులు, మూవీ వర్క్‌ చేసిన సిబ్బందితో మూవీ విశేషాలను, బిహైండ్‌ కెమెరా వెనక జరిగిన ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ఇలా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో వారికి ఉన్న అనుబంధం, సినిమా చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను ఇందులో చర్చించారు. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్‌ 20న థియేటర్‌లో విడుదలైంది. అప్పుడే ఇది ఓటీటీలోకి రాబోతోంది.

థియేటర్‌లో విడుదలైన వారంలో రోజులకే ఈ డాక్యుమెంటరీ ఓటీటీకి రావడం విశేషం. డిసెంబర్‌ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ విడుదల కానుంది. తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా 2022లో విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వరల్డ్‌ వైడ్‌ ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇంటర్నేషనల్‌ వేదికలపై ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాతో తెలుగు సినీ స్థాయిలో ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాపై హాలీవుడ్‌ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పర్ఫామెన్స్‌కి ఫిదా అయ్యారు.

Exit mobile version
Skip to toolbar