Site icon Prime9

Kantara : “కాంతార” చాప్టర్ – 1 ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్.. అరాచకానికి అసలైన అర్ధం చూపించేశారుగా !

rishab shetty kantara chapter 1 first glimpse released and got viral

rishab shetty kantara chapter 1 first glimpse released and got viral

Kantara: కాంతర సినిమా 2022లో ఎంతటి  సంచలనం క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఈ  మూవీకి ప్రీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిషబ్ శెట్టి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తాడా అని వెయిట్ చేస్తున్న కాంతార మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ బయటకి వచ్చేసింది.

తాజాగా ఈమూవీ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో కదంబుల పాలనలో పునాణగాథ పుట్టిందనే కాన్సెప్ట్ తో ఈ గ్లింప్స్ ని విడుదల చేశారు. `కాంతార`లో రిషబ్‌ శెట్టి పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లాడు. అక్కడ దేవుడు నిలిచే స్థలంలో ఆగిపోయాడు. అతని చుట్టూ మంటలు ఉన్నాయి, ఆకాశం వైపు చూడగా, ఓ భీకరమైన శబ్దంతో రిషబ్‌ శెట్టి ఓ భయంకరమైన యోధుడిలా మారిపోయారు. కండలు తిరిగిన దేహంతో, ఒంటి నిండా రక్తం కారుతూ కనిపించాడు. ఆయన లుక్‌, వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. `కాంతార` ని మించి ఈ `కాంతార2` ఉంటుందని అర్థమవుతుంది.

ఈ టీజర్ … దారి చూపించేది వెలుగు కాదు దర్శనం అంటూ మొదలయ్యింది. ఆ తర్వాత వరాహ అవతారంలో త్రిశూలం పట్టుకోని, గండ్ర గొడ్డలి పట్టుకోని కనిపించిన రిషబ్ శెట్టి గూస్ బంప్స్ తెప్పించాడు. రిప్డ్ బాడీతో, లాంగ్ హెయిర్ తో పరమ శివుడిని గుర్తు చేసేలా ఉన్న రిషబ్ శెట్టి కాంతర పార్ట్ 1కి ఇన్స్టాంట్ హైప్ తెచ్చాడు. టీజర్ లో ఇంకో మెయిన్ హైలైట్ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కాంతర సినిమాకి ప్రాణం పోసిన అజనీష్ మరోసారి తన మ్యాజిక్ ని చూపించాడు. “ఓ” అనే అరుపు టీజర్ లో ప్లే అవ్వడమే ఆలస్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఏడు భాషలకి కలిపి ఒకటే టీజర్ ని రిలీజ్ చేశారు . ఇంతక ముందు కన్నడలో రిలీజ్ అయ్యి పాన్ ఇండియాకి స్ప్రెడ్ అయిన కాంతర ఈసారి రిలీజ్ అవ్వడమే పాన్ ఇండియా టార్గెట్ గా రిలీజ్ అవుతోంది. మరి రిషబ్ ఈసారి ఎలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version