Site icon Prime9

Dragan OTT: ‘డ్రాగన్‌’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Dragon OTT Release Date: ‘లవ్‌టుడే’ ఫేం ప్రదీప్‌ రంగనాథన్‌ రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ అనే మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్‌టుడే చిత్రంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడంతో తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళంలో ‘డ్రాగన్‌’ మూవీ చేశాడు. ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్’ పేరుతో తెలుగులో డబ్‌ చేశారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌?

తెలుగు, తమిళంలో మూవీకి మంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో హిందీలోనూ రిలీజ్‌ చేయబోతున్నారు. మార్చి 14న హిందీలో రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఇంతలోనే దక్షిణాది భాషల్లో ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. మార్చి 21 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ మూవీ రైట్స్‌ తీసుకుంది. తెలుగులో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషలో ఈ మూవీని స్ట్రీమింగ్‌కి తీసుకురాబోతోంది. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుందంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్‌ చక్కర్లు కొడుతోంది. దీంతో డ్రాగన్‌ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యింది.

డ్రాగన్‌ కథ విషయానికి వస్తే

రాఘవన్‌ (ప్రదీప్‌ రంగనాథన్‌) చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంట్‌. ఇంటర్‌లో 96 శాతం మార్కులతో పాస్‌ అవుతాడు. అప్పుడే తనకు ఇష్టమైన అమ్మాయి కీర్తి (అనుపమ పరమేశ్వరన్‌)కి ప్రపోజ్‌ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్‌ బాయ్స్‌ అంటే ఇష్టమని, నీలా మంచి వాళ్లంటే తనకు ఇష్టం లేదని చెప్పి రాఘవన్‌ ప్రేమను రిజెక్ట్‌ చేస్తుంది. ఆ తర్వాత బిటెక్‌లో చేరతాడు. ప్రేమించిన అమ్మాయి కోసం బ్యాడ్‌ బాయ్‌గా మారిన రాఘవన్‌ బిటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతాడు. దీంతో రెండేళ్ల పాటు ఖాళీగా ఉంటాడు. రాఘవన్‌ సెటిల్‌కాకపోవడంతో కాలేజీలో తను ప్రేమించిన కీర్తి(అనుపమ పరమేశ్వరన్‌) బ్రేకప్‌ చెప్పి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు.

దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్‌ కావాలని పట్టుదలతో ఉంటాడు. ఫేక్‌ సర్టిఫికేట్స్‌ తీసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎదుగి సొంత ఇల్లు, కారు కొంటాడు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకుంటాడు. అదే టైంలో డబ్బు బాగా ఉన్న అమ్మాయి పల్లవి(కయాదు లోహర్‌)తో పెళ్లికి సిద్ధమవుతాడు. అదే టైంలో రాఘవన్‌ ఫేక్‌ సర్టిపికేట్స్‌ గురించి తన కాలేజీ ప్రిన్సిపల్‌కి తెలిసిపోతుంది. అది అడ్డుపెట్టుకుని రాఘవన్‌ని బెదిరిస్తాడు ప్రిన్సిపల్‌. ఆ విషయాన్ని బయటకపెట్టకుండ ఉండేదుకు రాఘవన్‌కి ఓ కండిషన్‌ పెడతాడు. ఇంతకి ఆ కండిషన్‌ ఏంటీ? మళ్లీ అన్ని సబ్జెక్ట్స్‌ ఒకేసారి ఎలా పాప్‌ అవుతాడు? బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయిర కీర్తి మళ్లీ అతడి లైఫ్‌లోకి ఎందుకు వచ్చింది? పల్లవిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ చూసి తెలుసుకోవాల్సిందే.

Exit mobile version
Skip to toolbar