Site icon Prime9

Dhamaka : రవితేజ ’ధమాకా‘ లో సీన్లు రీషూట్

Dhamaka movie

Dhamaka movie

Tollywood News: మాస్ మహారాజా రవితేజకు ఇపుడు సాలిడ్ హిట్ కావాలి. అతని తాజా చిత్రం ధమాకా యాక్షన్‌తో కూడిన కామిక్ ఎంటర్‌టైనర్ . త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్‌లో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. రవితేజ రఫ్ కట్ చూసాడు. కొన్ని ఎపిసోడ్లు అతనికి నచ్చకపోవడంతో మరలా రీషూట్ చేసేలా నిర్మాతను ఒప్పించాడు.

నిఖిల్ యొక్క కార్తికేయ 2 కోసం పనిచేసిన కొత్త రచయిత స్క్రిప్ట్ రీవర్క్‌లో పాల్గొన్నారు. కొన్నిఎపిసోడ్‌లు మళ్లీ చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీ లీల కథానాయికగా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు. భీమ్స్ సంగీతం అందించిన ధమాకాపై మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రవితేజ  ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో డేగ సినిమా చేస్తున్నాడు. అతను రావణాసురుడు మరియు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ పూర్తి చేసాడు.

Exit mobile version