Site icon Prime9

Renu Desai: అప్పుడే సినిమాల్లోకి అకిరా నందన్‌ – రేణు దేశాయ్‌ కామెంట్స్..

Akira Nandan Tollywood Entry: నటి రేణు దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై ఆమె కనిపించేది తక్కువే. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తుంటారు. రీసెంట్‌గా తన పిల్లలతో కలిసి ఆద్యాత్మిక పర్యటనకు వెళ్లొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్‌ చేసింది.

అయితే తాజాగా రేణు దేశాయ్‌ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంతరం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు తన కొడుకు అకిరా సినీరంగ ప్రవేశంపై ప్రశ్న ఎదురైంది. అకిరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. దీనికి రేణు దేశాయ్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రేణు దేశాయ్‌ మాట్లాడుతూ.. “ఆ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అకిరా మూవీ ఎంట్రీపై తల్లిగా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా తన ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అప్పటి వరకు వేయిట్‌ చేయండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Exit mobile version
Skip to toolbar