Waltair Veerayya Success Meet : మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”.
బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.
ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.
మాస్ మహారాజా రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
అన్నయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించిన రవితేజ మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవితో స్క్రీన్ పంచుకున్నారని అంటున్నారు.
మళ్లీ వారిద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడటం కన్నుల పండుగగా ఉందంటున్నారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటించిడం పట్ల ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాప్పీ అవుతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కాగా తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది.
రవితేజ కామెంట్స్.. Waltair Veerayya Success Meet
ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. అన్నయ్య ఇది కాదు కానీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేద్దాం అన్నారు.
రవితేజ, చిరు లని పెట్టి సినిమా చెయ్యడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీ, ట్యూన్స్ ఇవ్వడానికి దేవి శ్రీ ప్రసాద్ రెడీ
ఇక దర్శకుడు బాబీ కూడా రెడీ అయితే మరోసారి ఈ మెగా మాస్ కాంబోలో సినిమా చూసే అవకాశం వస్తుంది.
చిరంజీవి కామెంట్స్.. Waltair Veerayya Success Meet
అలానే చిరంజీవి మాట్లాడుతూ.. రవితేజ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
నేను ఈ సినిమా కోసం కష్టపడలేదు. నా బాధ్యతగా అనుకుని పనిచేశా.
కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ అని అన్నారు.
ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టే అంత బాగా చేయగలిగానన్నారు.
రవితేజ తప్ప ఈ క్యారెక్టర్ మరొకరు న్యాయం చేయలేరన్నారు.
నిజంగా రవితేజ నాకు తమ్ముడు లాంటివాడు అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమా విజయం ఔత్సాహిక దర్శకులకు ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని చెప్పారు.
నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని మెగాస్టార్ చిరంజీవి సూచించారు.
ఫస్ట్ డే కలెక్షన్స్.. Waltair Veerayya Success Meet
డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లలో అన్నయ్య అదరగొట్టారని చెబుతున్నారు.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వసూళ్లలోనూ అదరగొడుతోంది. తొలిరోజు ఏకంగా రూ.29 కోట్లకు పైగా రాబట్టింది.
చిరంజీవి కెరీర్ లోనే అతడిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం పట్ల మెగాస్టార్, మాస్ మహరాజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ సెట్ అయితే త్వరలోనే వీరి కాంబోలో సినిమా తెరకెక్కడం ఖాయం అనిపిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/