Ravi Teja Mass Jathara Movie Glimpse: మాస్ మహారాజ రవితేజ ఫలితాలతో సంబంధంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది మిస్టర్ బచ్చన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆయన ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీం. ఇవాళ రవితేజ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఆయనకు బర్త్‌డే విషెష్ చెబుతూ రవితేజ పాత్రను పరిచయం చేసింది. ఇందులో మాస్ మహారాజ ‘మాస్ జాతర’ చూస్తారనేట్టుగా ఈ గ్లింప్స్ సాగింది. మాస్ ర్యాంపెజ్ గ్లింప్స్ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో రవితేజ్ లుక్, క్యారెక్టర్, సీన్స్ విక్రమార్కుడు సినిమాను తలపించాయి. చూస్తుంటే ఈసారి ఈ మాస్ మహారాజ్ గట్టి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా, సాధారణ వ్యక్తి గెటప్‌లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఈసారి ఈ మాస్ మహారాజ ‘మాస్ జాతర’ ఎలా ఉండబోతోందో చూడాలి. కాగా సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి సామజవరగమన చిత్రానికి రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.