Site icon Prime9

Viral Video: నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేసిన రష్మిక మందన్న, అలియా భట్.. వైరల్ గా మారిన వీడియో

Viral Video

Viral Video

Viral Video: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.  దేశ వ్యాప్తంగా ఉన్న కళలను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి  నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు.

ఈ కల్చరర్ సెంటర్ ప్రారంబోత్సవం సందర్భంగా నిన్నటి నుంచి వేడుకులు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు అంబానీ కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి ఈ వేడుకలు వచ్చారు.

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ దంపతులు, సిద్ధార్థ్‌-కియారా అద్వానీ దంపతులు, దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనాస్‌, ఐశ్వర్యరాయ్‌, ఆలియా భట్‌, సోనమ్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌, శ్రద్ధాకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌-కరీనా కపూర్ దంపతులు‌, కరిష్మా కపూర్‌, షాహిద్‌ కపూర్, సల్మాన్‌ ఖాన్‌,  అమీర్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు.  అటు సచిన్‌ టెండూల్కర్ తన ఫ్యామిలీతో కలిసి వచ్చారు.  అభినవ్ బింద్రా, సానియా మీర్జా,  దీపా మాలిక్ సహా పలువురు క్రీడాకారులు సైతం హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా జరిగిన ఈవెంట్ లో రష్మిక, అలియా భట్ ఇద్దరూ కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేశారు. వారి వారి స్టైల్లో హుక్ మూమెంట్ తో అదరగొట్టారు. స్టార్ బ్యూటీలు అద్భుతంగా చేసిన డాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ప్రారంభోత్సంలోనూ రష్మిక ‘పుష్ప’ సినిమాలోని ‘సామి రారా సామి’ అనే పాటతో పాటు ‘శ్రీవల్లి’ అనే పాటకు డ్యాన్స్ చేసి ఆడియెన్స్ ను అలరించింది. అలానే ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలోని ‘డోలీనా’ పాటకు.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసి దుమ్మురేపింది. మళ్ళీ ఇప్పుడు అలియాతో కలిసి డాన్స్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Exit mobile version