Site icon Prime9

Naaga Bandham First Look: అంచనాలు పెంచేస్తోన్న ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ – రానా చేతుల మీదుగా విరాట్ కర్ణ లుక్ రిలీజ్

Virat Karna First look From Naga Bandham: ‘పెద కాపు’ ఫేం విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శక్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ‘నాగబంధం’.. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. గూఢచారి, డెవిల్ వంటి సినిమాలకు  నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ గా వ్యవహరించి.. డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషేక్ నామా  ఈ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టారు.  పద్మనాభ స్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయల్లో బయటపడ్డ నిధులు, నిక్షేపాల ఆధారంగా నాగ బంధం కథను రాసుకున్నారు అభిషేక్ నామా. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో ఈ సినిమా సాగనుంది.
థండర్ స్టూడియోస్ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా మధుసూదన్ రావు నిర్మిస్తున్నారు. గతేడాది ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రకటించిన టీం ఈ సందర్భంగా కేజీయఫ్ నటుడు అవినాస్ మిస్టీరియస్ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచింది.  అయితే తాజాగా ఈ సినిమా నుంచి  హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో విరాట్ కర్ణ మొసలితో పోరాడుతూ కనిపించాడు. ఒక చేతితో ముసలి పై దవడ పట్టుకుని మరో చేతి కింది దవడను తాడుతో కట్టి లాగుతూ ఉన్నట్టు కనిపించాడు.
ఇందులో విరాట్ కర్ణ బీస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేశాడు. కర్లీ హెయిర్, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించాడు.
ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ అంచనాలు పెంచుతుంది. ముఖ్యంగా హీరో లుక్ బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుటున్న ఈ సినిమాను పురాతనమైన విష్ణు దేవాలయాల్లో దాచిన రహస్యాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.  ముఖ్యంగా నాగబంధం పవిత్ర ఆచారాన్ని ఈ సినిమాలో ప్రధాన అంశంగా చూపించబోతున్నారు. దేవాలయాల్లో నిక్షిప్తమైన నిధి రహస్యాలు ఆధారంగా నాగబంధం చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు అభిషేక్ నామా. పురాతన రహస్యాలకు సరికొత్త, ఆధునిక కథనంతో నాగబంధం కథ సాగనుంది. ఈ చిత్రం  పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్ అవినాస్ వంటి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025లో ఈ సినిమా తెలుగు, తమిళం,  హిందీ, కన్నడతో పాటు మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Exit mobile version
Skip to toolbar