Prime9

Rana Naidu 2 Trailer Out: అంచనాలు పెంచేలా ‘రానా నాయుడు 2’ ట్రైలర్‌!

Rana Naidu: Season 2 Web Series Telugu Official Trailer Out: విక్టరి వెంకటేష్‌, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్‌ ‘రానా నాయుడు’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. 2023లో విడుదలైన ఈ సీజన్‌ విశేష ఆదరణ పొందింది. అమెరికన్‌ క్రైం డ్రామా ‘రే డోనోవన్‌’ ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఇప్పుడు ఈ సిరీస్‌కి సీక్వెల్‌ వస్తున్న సంగతి తెలిసిందే. రానా నాయుడు 2గా సీక్వెల్‌ని రూపొందించారు. జూన్‌ 13 నుంచి రానా నాయుడు 2 నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

 

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. తొలి సీజన్‌లో బోల్డ్‌ కంటెంట్‌ ఉండటంతో తెలుగు, సౌత్‌ ఆడియన్స్‌ నుంచి రానా నాయుడి సిరీస్‌పై విమర్శలు వచ్చాయి. నార్త్‌లో దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కానీ, తెలుగు ఆడియన్స్‌ నుంచి మాత్రం వ్యతిరేకత రావడంతో సీజన్‌ 2లో దానికి తగ్గించినట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో బోల్డ్‌ సీన్స్‌ కనిపించనే లేదు. ఈసారి సీక్వెల్‌.. తొలి సిజన్‌ మించి ఉండేలా ఉందనిపిస్తోంది ట్రైలర్‌ చూస్తుంటే.

 

వినోదం, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు యాక్షన్‌ సీక్వెన్స్ బాగా చూపించారు. బూతులు కూడా పెద్దగా వినిపించలేదు. ఫస్ట్‌ పార్ట్‌లో బోల్డ్‌ కంటెంట్‌తో అసభ్యకరమైన పదాలను వాడారు. ఈ క్రేజీ సిరీస్‌ని కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రా తెరకెక్కిస్తుండగా, సంఉదర్‌ ఆరోన్‌, లోకోమెటివ్‌ గ్లోబల్‌ మీడియా నిర్మించింది. అర్జున్‌ రాంపాల్‌, సుర్వీన్‌ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్‌ సింగ్‌, అభిషేక్‌ బెనర్జీ, డినోమెరియా తదితరులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. రియల్‌ లైఫ్‌లో బాబాయ్‌, అబ్బాయిలైన వెంకటేష్‌, రానాలు ఈ సిరీస్‌లో తండ్రికొడుకులుగా నటించారు.

 

తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. జూన్‌ 13 నుంచి వరల్డ్‌ వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్‌ రానా నాయుడు 2 విడుదల కాబోతోంది. తొలి సీజన్‌ మంచి విజయం సాధించడం సెకండ్‌ సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత రెండో సీజన్‌ ప్రకటించడంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఇక తాజాగా విడుదలై ట్రైలర్‌ చూస్తుంటే తొలి సీజన్‌ మించి సీక్వెల్‌ అదిరిపోయేలా ఉందంటున్నారు అభిమానులు. మరి జూన్‌ 13న స్ట్రీమింగ్‌ రానున్న ఈ సీక్వెల్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఎలాంటి రికార్డులు బ్రేక్‌ చేస్తుందో చూడాలి.

 

Rana Naidu: Season 2 | Official Trailer | Rana Daggubati, Venkatesh, Arjun Rampal | Netflix

 

Exit mobile version
Skip to toolbar