Ram Veerapaneni: ఓ వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ లో బెదిరించడమే కాకుండా పలు విధాలనుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయన బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గాయని సునీత భర్త వీరపనేని రామకృష్ణ బంజారాహిల్స్ రోడ్ నెం2 లో ని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఈ మధ్య ఆయన ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది.
నెంబర్ బ్లాక్ చేసినా వేధింపులు(Ram Veerapaneni)
తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మెంబర్ అని కెకె లక్ష్మణ్ అనే వ్యక్తి సదరు మెసేజ్ పంపాడు. వ్యక్తిగతంగా కలవాలని మెసేజ్ పంపిన వ్యక్తి అడగ్గా.. దానికి రామకృష్ణ అంగీకరించలేదు. బిజినెస్ కు సంబంధించిన విషయాల కోసం అయితే తన సిబ్బందిని కలవాలని రామకృష్ణ తెలిపాడు. అయితే సదరు వ్యక్తి రోజు సందేశాలతో వేధిస్తుండటంతో… ఆ నెంబర్ ను రామకృష్ణ బ్లాక్ చేశాడు. కానీ గత నెల 28 న మరో కొత్త నెంబర్ లో మళ్లీ మెసేజ్ లు పంపడం ప్రారంభించాడు.
అంతేకాకుండా ఈసారి బెదిరింపులకు దిగాడు. దీంతో రామకృష్ణ.. తనకు తన కుటుంబ సభ్యులుకు లక్ష్మణ్ నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండేళ్ల క్రితం సింగర్ సునీతకి వీరపనేని రామకృష్ణతో వివాహం అయన విషయం తెలిసిందే.