Site icon Prime9

Double Ismart : మళ్ళీ “డబుల్ ఇస్మార్ట్” గా రానున్న రామ్ పోతినేని.. ఈసారి నెక్స్ట్ లెవెల్ !

ram pothineni double ismart movie poster released

ram pothineni double ismart movie poster released

Double Ismart : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తనదైన శైలిలో రాణిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్న రాపో ఈరోజు (మే 15) తన 35వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.

కాగా రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరి కెరీర్‌‌కు ఈ చిత్రం మంచి ఊపు ఇచ్చింది అని చెప్పాలి. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించి రామ్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ ను ప్రకటించి.. 2024 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుత ఈ పోస్టర్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ సినిమా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. పూరి, చార్మి నిర్మాతలుగా పూరి కనెక్ట్స్ బ్యానెర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. బోయపాటితో మూవీ కంప్లీట్ అయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

ఇక రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ లో “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అంటూ రామ్ చెప్పిన డైలాగ్ అయితే ఇచ్చిపడేసింది. కాగా ఈ సినిమా టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని తెలుగు తమిళ మళయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.

Exit mobile version