Site icon Prime9

Ram Gopal Varma : అషు రెడ్డి కాళ్ళని ముద్దాడుతున్న ఆర్జీవి… వైరల్ గా మారిన వీడియో !

ram gopal varma kissing ashu reddy feet video goes viral

ram gopal varma kissing ashu reddy feet video goes viral

Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్ లను అందించిన వర్మ, ఈ మధ్య కాలంలో తన చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సైతం మీలో పాత వర్మను చూడాలని ఉందంటూ బహిరంగం గానే తెలిపారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ” డేంజరస్ ” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగోలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

లెస్బియన్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయొద్దంటూ పలు ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అన్నీ అడ్డంకులను దాటుకొని డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ కి సిద్దం అయ్యింది. ఈ తరుణంలోనే తనదైన శైలిలో ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. వర్మ ఇటీవల కొంతమంది అందమైన అమ్మాయిలతో ఇంటర్వ్యూ నిర్వహించి పలు బొల్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డితో మరో ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డి కూర్చొని ఉండగా, వర్మ ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ సంధర్భంలోనే నీ కాలుని ముద్దు పెట్టుకోవాలని ఉందంటూ, ముద్దు పెట్టుకొనే వరప్రసాదం ఇవ్వాలంటూ అషు రెడ్డినీ వర్మ కోరాడు. దీనికి అషు రెడ్డి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇంతసేపు నా పదాలు దగ్గర ఒక భక్తుడిలా కూర్చొని నన్ను దేవతల ట్రీట్ చేసిన మీ కోరిక తీర్చకుండా ఉంటానా అని చెప్పింది. ఇక వెంటనే వర్మ ఆమె కాలుని ముద్దాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా వీరిద్దరూ చేసిన ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అయ్యింది.

Exit mobile version