Site icon Prime9

RC15 : రామ్ చరణ్ మూవీలో ఒక్క పాటకే రూ.15 కోట్ల బడ్జెట్

RC15

RC15

RC15 : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన రాబోయే పొలిటికల్ యాక్షన్ డ్రామా RC15 తో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రం ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఈ రోజు, మేకర్స్ సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందించారు. 15 కోట్లతోసాంగ్ షూట్ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు ప్లాన్ చేసినట్లు తెలిపారు ఈ పాటలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ డ్యాన్స్ చూసితీరవలసిందేనని సమాచారం.12 రోజుల షూటింగ్ మరియు 15 కోట్ల బడ్జెట్ అంటే ఈ పాటను ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ చిత్రానికి కథను కార్తీక్ సుబ్బరాజ్ అందించగా, దిల్ రాజు మరియు శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version