Site icon Prime9

Ustaad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..?

ram charan reaction on Ustaad Bhagath Singh glimpse

ram charan reaction on Ustaad Bhagath Singh glimpse

Ustaad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో రిలీజ్ కానుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండడం మరో కలిసొచ్చే అంశం. దాదాపు పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేసింది. పవన్ కళ్యాణ్ లోని స్వాగ్ ని మరోసారి సినిమా దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్.. పవన్ కళ్యాణ్ మేనరిజం.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యి ఫ్యాన్స్ కి ఊరమాస్ ట్రీట్ ఇచ్చాయి. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో  ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది’ అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో #1లో ట్రెండ్ అవుతుంది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 2 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. గ్లింప్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే మున్ముందు వచ్చే అప్డేట్స్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవ్వడం ఖాయమన్నారు. తాజాగా ఈ గ్లింప్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తాన మనసులోని మాటల్ని బయటపెట్టారు.

ఉస్తాద్ భగత్ సింగ్ చూడడానికి వెయిటింగ్ – చరణ్ (Ustaad Bhagath Singh)

ఈ మేరకు ఆ ట్వీట్ లో.. ‘పవన్ కళ్యాణ్ గారి మాసీ గ్లింప్స్ బాగా నచ్చింది. థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ ని చూడడానికి వేచి ఉండలేకపోతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అంటూ రాసుకొచ్చారు. దీంతో బాబాయ్ – అబ్బాయి మధ్య బాండింగ్ అంటే ఆ మాత్రం ఉంటది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతుంది. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు.

 

Exit mobile version