Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కాగా కేవలం నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న ఆస్కార్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నామినేట్ కాగా.. ఇప్పటకే పలు అంతర్జాతీయ అవార్డులను పొందిన ఈ సినిమా ఈ అవార్డును కూడా దక్కించుకుంటుందని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక హాలీవుడ్ లో కూడా చరణ్ పేరు గట్టిగా వినిపిస్తుండడంతో పలు హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ తో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ పాపులర్ టాక్ షోలు.. గుడ్ మార్నింగ్ అమెరికా, ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ వంటి షోలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు చరణ్. దీంతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎప్పుడంటూ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది.
ఆమె సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ – చరణ్ (Ram Charan)
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ డెబ్యూట్ గురించి వెల్లడించాడు చరణ్. ఆఫర్స్ వస్తే ఇండియన్ యాక్టర్స్ టాలెంట్ కూడా చూపిస్తామని ఇప్పటికే కామెంట్ చేసిన రామ్ చరణ్ .. త్వరలోనే తన హాలీవుడ్ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలిపారు. తాజాగా అమెరికాలోని టాక్ ఈజీ పాడ్ కాస్ట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన హాలీవుడ్ ఎంట్రీపై అదిరిపోయే అప్డేట్ అందించారు చరణ్. హాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ అప్డేట్ త్వరలోనే రానుందని ఇంటర్వ్యూలో చెప్పారు. అదే విధంగా తనకు ఎంతో ఇష్టమైన జూలియా రాబర్ట్స్ తో నటించాలని ఉందంటూ.. ఆమె సినిమాలో గెస్ట్ రోల్ చేసే అవకాశం వచ్చినా ఇష్టమేనని చరణ్ అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mega Power Star #RamCharan on his Hollywood Entry💥💥@AlwaysRamCharan pic.twitter.com/3qW5KyFAu1
— Fukkard (@Fukkard) March 8, 2023
ఇక దీంతో త్వరలో చరణ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ చరణ్ ని పొగిడేస్తున్నారు. ఇక ఆస్కార్స్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు తాజాగా RC 15 మూవీ ఐదు ప్రధాన లొకేషన్స్ లో మాంటేజ్ సాంగ్ షూట్ జరుపుకుంది. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు లోని ల్యాండ్ మార్క్ లొకేషన్స్ లో ఆ మాంటేజ్ సాంగ్ షూట్ జరిగింది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రతీ లొకేషన్ నుంచీ లీక్స్ ఓ రేంజ్ లో వచ్చి పడ్డాయి. అంతేకాదు. ఈ పాట లిరిక్స్ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/