Site icon Prime9

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ బెనిఫిట్‌ షోకు ప్రభుత్వం నిరాకరణ – టికెట్‌ రేట్స్‌ పెంపుకు గ్రీన్‌ సిగ్నల్‌

Game Changer Ticket Rates Hike

Game Changer Ticket Rates Hike

Game Changer Ticket Rates Hike: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ టికెట్‌ రేట్స్‌ పెంపు, బెనిఫిట్‌ షోలోపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పుష్ప 2 బెనిఫిట్‌ షోలో సంధ్య థియేటర్‌ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో గేమ్‌ ఛేంజర్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టికెట్‌ రేట్స్‌ పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత చరణ్‌ నటించిన చిత్రమిది. దీంతో మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య జనవరి 10న రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ మూవీ టికెట్‌ రేట్స్‌ పెంపుకు, బెనిఫిట్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? అనేది సస్పెన్స్‌ నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణలో మూవీ టికెట్‌ రేట్స్‌ పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 10న ఉదయం 4 గంటల షో నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చింది.

మల్టీప్లెక్స్‌ టికెట్‌కు అదనంగా రూ. 150, సింగిల్‌ స్క్రీన్స్‌ షోలకు టికెట్‌కు అదనంగా రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో రూ. 100, సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 50 మల్టీప్లెక్స్‌లో పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంటకు పెంచిన ధరతో బెనిఫిట్‌ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది.

ఏపీలో ఇలా..

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను రూ. 600లుగా నిర్ణయించారు. అలాగే రిలీజ్‌ రోజు జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ. 175 (జీఎస్టీతో కలిపి) సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ. 135 వరకు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11వ తేదీ నుంచి 23 తేదీ వరకు ఇవే ధరలతో 5 షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Exit mobile version