Site icon Prime9

Akkineni Akhil : ఒకే వేదికపై మెగా, నందమూరి హీరోలు.. అక్కినేని అయ్యగారి “ఏజెంట్” కోసం..!

ram charan and ntr going to attend akkineni akhil agent movie event

ram charan and ntr going to attend akkineni akhil agent movie event

Akkineni Akhil : సురేందర రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీలో అఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 9 ఏళ్లు అవుతున్నా.. అతడికి సరైన మాసివ్ హిట్ పడలేదనే చెప్పాలి. 2021లో పూజా హెగ్డేతో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అతడి స్టార్ డమ్‌ను మాత్రం పెంచలేదనే చెప్పాలి. దాంతో ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలని ఎంతో ఆశగా ఉన్నాడు అఖిల్.

ఏజెంట్ సినిమాలో 8 ప్యాక్ లో అఖిల్ కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఫిజికల్ గా చాలా ట్రాన్స్ ఫార్మ్ అయినట్లు కనబడుతున్నాడు. చిరంజీవి సైరా నరసింహారెడ్డి తర్వాత సురేంద్రరెడ్డి డైరక్షన్ చేస్తున్న ఈ చిత్రంపై పేరెక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్,  పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఇక అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్ళే ప్లాన్ లో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గట్టిగానే ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి “ఆర్ఆర్ఆర్” హీరోలు (Akkineni Akhil)..

ఈ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను కలిపి గెస్టులుగా పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ ఇద్దరు హీరోలు గనక నిజంగానే అఖిల్ ఏజెంట్ మూవీ కోసం వస్తే, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఒకే వేదికపై మెగా, నందమూరి, అక్కినేని హీరోలను చూసే అవకాశం ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే అఖిల్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు వస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో అఖిల్ మూవీ గెస్ట్ గా ఎన్టీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. అఖిల్ ని సొంత బ్రదర్ లాగే తారక్, చరణ్ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూ లలో కూడా ఓపెన్ గా చెప్పారు. ఇక సురేందర్ రెడ్డి కూడా గతంలో మెగాస్టార్ తో సైరా, చరణ్ తో ధృవ సినిమాల్ని తెరకెక్కించాడు. దీంతో చరణ్ తప్పక వస్తారని.. నాగార్జున ఫ్యామిలీ తో తారక్ కి ఉన్న మంచి రిలేషన్ కారణంగా ఆయన కూడా వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది.  మరోవైపు ఏజెంట్ చిత్రానికి సంబంధించిన నైజాం, సీడెడ్, ఏపీ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.35 కోట్ల భారీ రేటుకు అమ్ముడైనట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గాయత్రి దేవి ఫిలింస్ అధినేత సతీష్ ఈ మేరకు ఏజెంట్ చిత్ర రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

 

Exit mobile version