Site icon Prime9

Rajinikanth: అలాంటి ప్రశలు అడగొద్దు – జర్నలిస్ట్‌పై రజనీకాంత్‌ అసహనం

Rajinikanth Said Dont ask him political Questions: అలాంటి ప్రశ్నలు అడగవద్దని ఓ రిపోర్టర్‌పై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ కోసం ఆయన విదేశాలకు వెళుతుండగా.. ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. దీంతో మీడియా ఆయనను పలు ప్రశ్నలు అడిగింది. కూలీ మూవీ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందని అడగా.. 70 శాతం పూర్తయ్యిందని చెప్పారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ జనవరి 13 నుంచి జనవరి 23 వరకు ఉంటుందని తెలిపారు.

ఇంతలో ఓ జర్నలిస్ట్‌ తమిళనాడులో మహిళ భద్రత గురించి ప్రశ్నించడంతో రజనీ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ సంబంధమైన ప్రశ్నలు అడగవద్దని ముందే చెప్పాను కదా మండిపుడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతేడాది డిసెంబర్‌ 23న చెన్నైలోని అన్నా యూనిర్శిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్యాంపస్‌లో ప్రియుడితో చనువుగా ఉన్న సమయంలో జ్ఞానశేఖర్‌ అనే వ్యక్తి వీడియో తీశాడు. దానితో ఆ యువతిని బ్లాక్‌మెయిల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

అంతేకాదు తను పలిచినప్పుడల్లా రావాలని, తను చెప్పిన సార్‌ దగ్గరికి వెళ్లాలని ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు జ్ఞనశేఖర్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు డీఎంకే పార్టీ కార్యకర్త అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో మద్రాస్‌ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది.

రజనీ కూలీ విషయానికి వస్తే.. ఈ సినిమా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. విక్రమ్‌, లియో వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇందులో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, కన్నడ హీరో ఉపేంద్ర, శ్రుతి హాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజనీ దేవా పాత్రలో కనిపించనుండగా.. నాగార్జున సైమన్‌ అనే పాత్ర పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version