Site icon Prime9

Kanthara : రిషబ్ శెట్టికి బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చిన రజనీకాంత్

gift

gift

Kanthara: ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ఏమైనా ఉందంటే అది కన్నడ చిత్రం కాంతార అనే చెప్పాలి. కన్నడంలో రూపొందిన ఈ చిత్రం ఇతర భాషల్లో కూడ అనువాదమై వసూళ్ల తుఫాను సృష్టించింది. దేశంలోని అన్ని భాషలకు చెందిన నటులు, దర్శకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

కాంతారానటుడు మరియు దర్శకుడు, రిషబ్ శెట్టి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రజనీకాంత్ . కాంతారా లాంటి సినిమాలు 50 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయని ప్రశంసల వర్షం కురిపించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్న రజనీకాంత్ అతనికి బాబా లాకెట్టుతో కూడిన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారుప

రిషబ్ శెట్టి కాంతారా చిత్రానికి రచన, నటన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం మొదట బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా ప్రారంభమయినా తరువాత మౌత్ టాక్ పుంజుకోవడంతో వసూళ్లలో దూసుకుపోతోంది.

Exit mobile version